Mana Enadu: ఆర్టికల్ 370పై మరోసారి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly)లో ఘర్షణ వాతావరణ నెలకొంది. లంగేట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్(MLA Khurshid Ahmed Shaikh) ఆర్టికల్ 370 తొలగింపునకు సంబంధించిన బ్యానర్ సభలో చూపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన BJP సభ్యులు దాన్ని లాక్కొని, చించివేసేందుకు యత్నించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల MLAలు ఒకర్ని ఒకరు తోసుకున్నారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. BJP ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివాదం మొదలైందిలా..
ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ(Awami Ittehad Party) ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ Article 370 రద్దుకు సంబంధించిన బ్యానర్‌ను సభలో ప్రదర్శించటం వల్ల ఈ వివాదం మొదలైంది. ప్రతిపక్ష నేత సునీల్ శర్మ(Sunil Sharma) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు బ్యానర్‌ను లాక్కునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి దాడులు చేసుకున్నారు. అనంతరం సభలోకి వచ్చిన మార్షల్స్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటికి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా MLAలను గట్టిగా తోయటంతో పలువురు BJP ఎమ్మెల్యేలు కిందపడ్డారు.
https://twitter.com/ANI/status/1854382548111245361
అసలేంటి ఆర్టికల్ 370?
ఆర్టికల్ 370 J&Kకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగం(Constitution of India)లో ఒక నిబంధన. దీనిద్వారా J&Kకు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా, J&Kకు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అయితే 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి(President) రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా సూచిస్తూ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌తో సమానమని కూడా పేర్కొంది. ఈ సవరణ ఆమోదం పొందినపుడు J&K రాష్ట్రపతి పాలనలో ఉంది.
J&Kకు ప్రత్యేక హోదా అలా వచ్చింది
సాధారణ పరిస్థితుల్లో, ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం అయితే, రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు. ఈ ఉత్తర్వు ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు J&Kకు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు. ఆ తర్వాత 2019 ఆగస్టు 9న రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూకశ్మీర్, లద్ధాఖ్)గా విభజించే చట్టాన్ని పార్లమెంట్(Parliament) ఆమోదించింది.






