దేశంలో వరుస ప్రమాదాలు.. ఇండియాకు అచ్చిరాని 2025!

దేశంలో వరుస ప్రమాదాలు(Accidents) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు పదికిపైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు.. పహల్గామ్ దాడి, తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో మహాకుంభమేళ(Maha Kumbh 2025)లో సిలిండర్ పేలి ప్రమాదం జరగా పలువురు మరణించారు. ఇక అదే కుంభ మేళాకు వెళ్లే క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట(Stampede at Delhi railway station)లో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. ఒక తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC టన్నెల్ కూలి 8 మంది సజీవ సమాధి అయ్యారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో..

ఇక జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Terror attack in Pahalgam)లో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియ వద్ద తొక్కిసలాట(Stampede at Chinnaswamy Stadium) జరిగి 11 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన(Air India Plane crash incident)లో ఫ్లైట్‌లోని 241 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. విమానం కూలిన భవనంలోని 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో మృతువులతోపాటు వందలాది మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో 2025లో అన్ని విషాద ఘ‌ట‌నలే చోటు చేసుకుంటున్నాయ‌నే చ‌ర్చ మొద‌లైంది.

 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *