
వియత్నాం(Vietnam)లో ఘోర ప్రమాదం జరిగింది. హలోంగ్ బే వద్ద శనివారం సాయంత్రం (జులై 19) జరిగిన పడవ బోల్తా(boat capsized) పడి 34 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు(Tourists) ఉండగా, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదానికి భారీ ఈదురు గాలులు(Strong gusty winds), ఉరుములతో కూడిన వాతావరణం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పడవ అదుపు తప్పడంతో నీటిలో మునిగిపోయింది. ఫలితంగా 34 మంది ప్రాణాలు కోల్పోగా, 8 మంది గల్లంతయ్యారు.
A tourist boat with 53 people capsized in #Vietnam‘s Halong Bay on Saturday amid Storm Wipha, killing three, state media reported.
The accident occurred around 2 p.m. local time during strong winds and heavy rain. Rescuers found 12 survivors and recovered three bodies. pic.twitter.com/9PMQAEZ2pA
— The Bharat Current (@thbharatcurrent) July 19, 2025
23 మందిని రక్షించింన సిబ్బంది
కాగా, సమాచారం అందుకున్న సహాయక బృందాలు(Rescue Teams) వెంటనే రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలు చేపట్టాయి, 23 మందిని సురక్షితంగా కాపాడాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన వియత్నాంలోని సముద్ర ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాల లోపాలను మరోసారి బయటపెట్టింది. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఈ విషాదాన్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన పర్యాటక రంగంలో భద్రతా చర్యల ఆవశ్యకతను గుర్తుచేసింది.
Search and rescue operations continued through Saturday night, as authorities raced against time to find the remaining 14 victims of the boat capsizing incident in Hạ Long Bay on July 19. Of 53 people on board, so far 10 have been rescued, 29 were dead.
📸VNA/VNS Photos pic.twitter.com/OQhnKK9z3E
— Việt Nam News (@VietnamNewsVNS) July 19, 2025