ఝార్ఖండ్(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Union Environment Minister Bhupender Yadav) స్వయంగా పంచుకున్నారు.
దాదాపు రెండు గంటలపాటు నిలిచి రైలు
వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని ఒక రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన గర్భిణి ఏనుగు(Pregnant elephant) ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఇది గమనించిన అటవీ శాఖ అధికారులు వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో కోల్‌తో నిండిన గూడ్స్ రైలును లోకో పైలట్ ట్రాక్‌పైనే నిలిపివేశారు. సుమారు రెండు గంటల నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు ఆడ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. అనంతరం తన బిడ్డతో కలిసి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. తల్లీబిడ్డ క్షేమంగా వెళ్లేంత వరకు రైలు అక్కడే ఆగి ఉంది.
![]()
ఇలాంటి ఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయి: కేంద్ర మంత్రి
బుధవారం తెల్లవారుజాము3 గంటల సమయంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారి నీతీష్ కుమార్(Forest Department Officer Nitish Kumar) మాట్లాడుతూ, ఏనుగు శిశువు సురక్షితంగా జన్మించే వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశామని తెలిపారు. ఈ ఘటనను అటవీ గార్డ్లు, స్థానికులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. మానవులు, జంతువుల మధ్య ఘర్షణ వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సామరస్యపూర్వక సంఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏనుగు ప్రసవానికి సహకరించిన వారి సున్నితమైన మనసును, జార్ఖండ్ అటవీ శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Beyond the news of human-animal conflicts, happy to share this example of human-animal harmonious existence.
A train in Jharkhand waited for two hours as an elephant delivered her calf. The 📹 shows how the two later walked on happily.
Following a whole-of government approach,… pic.twitter.com/BloyChwHq0
— Bhupender Yadav (@byadavbjp) July 9, 2025






