భారత మహిళలు అదరగొట్టారు. అండర్-19 ఉమెన్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ(Under-19 Women’s T20 Asia Cup 2024)లో యంగ్ ఇండియా(India) ఫైనల్(Final)కు దూసుకెళ్లింది. శుక్రవారం (డిసెంబర్ 20న) జరిగిన సెమీస్లో శ్రీలంక(Srilanka)ను మరో 31 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి చిత్తు చేసింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లలో 98/9 రన్స్ చేశారు. ఆ జట్టు బ్యాటర్లలో నిసంసల 21, కెప్టెన్ నానయక్కరా 33 రన్స్ చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆయూషీ శుక్లా 4, పర్ణికా సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది ఓపెనర్ ఈశ్వరి అవ్సరే డకౌట్ అయింది. మరో ఓపెనర్ కమలిని(Kamalini) 28 రన్స్ చేయగా. గొంగడి త్రిష(Gongadi Trisha) 32, మిథిలా వినోద్ 19 రన్స్ చేసి భారత(India) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బౌలర్లలో ప్రభోద 3, గిమ్హాని 2 వికెట్లు తీసింది. భారత బౌలింగ్లో అదరగొట్టిన ఆయూషి శుక్లాకు ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. కాగా ఆదివారం (డిసెంబర్ 22న) జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్(Bangladesh)తో భారత్ తలపడనుంది.
INDIA INTO THE FINALS 🏆
Aayushi Shukla 4/10 🌟
Parunika Sisodia 2/27
G Trisha 32 (24)India beat Sri Lanka in the Super 4 of the Women's U-19 Asia Cup to continue their unbeaten run and book a spot in the final.#ACCwomensU19AsiaCup pic.twitter.com/P5mwKcEmf5
— Women’s CricZone (@WomensCricZone) December 20, 2024








