నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా.. శైలష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3 ది థర్డ్ కేస్(HIT: The Third Case)’. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్(Teaser) మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు(promotions) పెంచేశారు. ఇప్పటికే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నడుమ వచ్చే మెలోడీ సాంగ్(Song)ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా నాని క్యారెక్టర్ను పరిచయం చేస్తూ.. ‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌తో పాటు ట్రైలర్ డేట్‌ను కూడా ఇచ్చేశారు. ఈ సాంగ్ నాని క్యారెక్టర్ను పరిచయం చేశారు.
ఫుల్ మాస్ యాంగిల్‌లో
కాగా వేటు వేసినా.. గీత రాసినా.. కోత మారునా నేడే అంటూ సాగిన ఈ పాట.. ఫుల్ మాస్ యాంగిల్‌లో సాగుతోంది. ఈ సాంగ్‌లో నాని యాక్షన్ సీన్లు చూపించారు. మిక్కీ జే మేయర్(Mickey Jay Meyer) మ్యూజిక్ అందిస్తుండగా అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్ పాడారు. కాగా ఇన్నాళ్లు సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించిన నాని.. దసరాలో ఒక మోస్తరు మాస్ చూపించినా.. నాని, హిట్ 3లో మాత్రం అరివీర భయంకరంగా కనింపించబోతున్నట్లు చూపించారు. అసలు రక్తపు మరకలు, కుక్కును కొట్టినట్లు మనుషులను కొట్టడం వంటివి ఈ సినిమాలో నాని పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది.
హిట్ 4లో కార్తి కనిపించనున్నాడా?
కాగా హిట్ సిరీస్‌లో భాగంగా హిట్ 1లో విశ్వక్‌సేన్(Vishwak Sen) నటిస్తే, హిట్ 2లో అడవి శేష్(Adavi Seshu) నటించారు. ఇక హిట్ 2 సినిమా చివరలో అర్జున్(Arjun)గా క్యామియో రూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హిట్ 3లో నాని(Nani) నటిస్తుండగా.. ఈ సినిమా చివర్లో కార్తి(Karthi) క్యామియో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. కార్తి హిట్ 4లో కూడా ఉండబోతున్నాడని తెలుస్తుంది.






