
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ దాడిలో ఆయన శరీరంపై ఆరుచోట్ల కత్తిపోట్లు దిగాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు సర్జరీ చేస్తున్నారు. దుండగులు ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#NewsAlert | A robbery attempt has been reported at actor-couple Saif Ali Khan and Kareena Kapoor Khan’s residence in Bandra, Mumbai
Saif Ali Khan was reportedly attacked by a thief during the incident and has been hospitalised
The authorities are investigating the CCTV footage… pic.twitter.com/QsGOVnLFLy
— ET NOW (@ETNOWlive) January 16, 2025