టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ (Suhaas) జోరుమీదున్నాడు. కీర్తి సురేశ్తో కలిసి ఆయన నటించిన ‘ఉప్పుకప్పురంబు’ (Uppu Kappurambu) సినిమా శుక్రవారమే (జులై 4న) రిలీజ్ కాగా.. మరో మూవీ వారం రోజుల్లోనే విడుదలవుతోంది. తమిళ ‘జో’ మూవీ ఫేమ్ మాళవిక మనోజ్ (Malavika Manoj)తో కలిసి నటించిన మూవీ‘ఓ భామ అయ్యో రామా’ (O Bhama Ayyo Rama) జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రామ్ గోదాల రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ పండిస్తూనే ఎమోషన్స్ సైతం కనిపించాయి. ట్రైలర్‌లో ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్ (Harish Shankar), మారుతి (Maruthi) కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.






