టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేటింగ్ రోజుల నుంచి పెళ్లయి ఇద్దరు పిల్లల్ని కన్నప్పటి వరకు ఈ జంట మొదటి నుంచి పవర్ కపుల్ గా పేరుపొందారు. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ ను బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ షేర్ చేసుకున్నాడు. తన లేటెస్ట్ సినిమా ‘బేబీ జాన్’ (Baby John) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం పంచుకున్నాడు.
బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ ధావన్ (Varun Dhawan) తన కోస్టార్స్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా ‘సుయి ధాగా’ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) గురించి ఆమె భర్త విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. 2018లో విడుదలైన ‘సుయి ధాగా’ కోసం అనుష్కతో కలిసి వరుణ్ నటించిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో తాము ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నామని.. తాను ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా ఉంటుందని.. అనుకున్న విషయాన్ని నిస్సంకోచంగా బయటపెడుతుందని చెప్పుకొచ్చాడు.
“అనుష్క (Virat Anuksha News) అన్యాయాన్ని అస్సలు సహించదు. సాధారణంగా ఆమెను చూసి బయటివారు ఒక ఒపీనియన్ కు వస్తారు. కానీ ఎవరికీ ఆమె గురించి తెలియదు. తను కూడా తన గురించి ఎవరు ఏమనుకుంటారు అన్న విషయం పట్టించుకోదు. తనకేం అనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. సుయీధాగా సమయంలో విరాట్ కోహ్లీ గురించి ఆమె కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.
విరాట్ చాలా సెన్సిటివ్ అని చెప్పింది. నాటింగ్ హామ్ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ఆయన రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పింది. ఆ రోజు మ్యాచ్‌లో ఆయన మంచి స్కోర్ చేసినా టీమ్ ఓటమి విషయంలో తనని తానే నిందించుకున్నారని అనుష్క తెలిపింది’’ అని ఈ పాడ్ కాస్ట్ లో హీరో వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.








