Vishwak Sen : పెళ్లి కబురు చెప్పిన విశ్వక్ సేన్!

టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరేందుకు రెడీ అయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen). తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన విశ్వక్ తన పెళ్లి కబురు చెప్పాడు. ఈ ఈవెంట్ యాంకర్ సుమ.. విశ్వక్ ను పెళ్లి గురించి ప్రశ్నించింది.

విశ్వక్ సేన్ పెళ్లెప్పుడు?

మీరు పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?’ అని సుమ అడగ్గా.. ‘మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. ఎప్పుడు పిల్ల దొరికితే అప్పుడు చేసుకుంటాను.’ అని విశ్వక్ సమాధానం ఇచ్చాడు. దీంతో త్వరలోనే మ‌నోడు కూడా ప‌ప్పు అన్నం పెట్టించ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ సంబురప‌డిపోతున్నారు.

కాస్త కామ్ గా ఉంటున్నా

ఇక విశ్వక్ సేన్ ఇటీవల లైలా (Laila Film) సినిమాలో నటించాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అలరించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇలాంటి చిత్రాలు చేయనంటూ విశ్వక్ అప్పట్లో ఓ పోస్టు కూడా పెట్టాడు. తాజాగా నాని నటించిన ‘హిట్ 3 (HIT 3)’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హ‌జ‌రైన ఆయన్ను యాంకర్ సుమ సరదాగా ఆయణ్ను ఇంటరాగేషన్ చేశారు. ‘అర్జున్ సర్కార్, విక్రమ్‌లో లేని క్వాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు.’ అన్న ప్రశ్నకు విశ్వక్.. ‘ఇద్దరిలో ఉండే ప్రశాంతత. కామ్ నెస్ అంటూ విశ్వక్ సేన్ సమాధానం ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *