భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse).. మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్(Mr.Bacchan)’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మహారాష్ట్రకు చెందిన ఈ యువ నటి తన అందం, అభినయంతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంటోంది. తొలుత మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ 2023లో “యారియాన్-2(Yariyaan-2)” అనే హిందీ మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ చేసి తన పాత్రకు న్యాయం చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్(Kingdom)’తోపాటు రామ్ పోతినేనితో ఓ సినిమాతోపాటు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న ‘కాంత(Kanta)’ చిత్రంలోనూ నటిస్తోందీ మరాఠీ భామ.
చాలా ఎత్తు నుంచి కిందకు దూకింది..
తాజాగా ఈ భాగ్యశ్రీ బోర్సే చేసిన ఓ సాహసం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో స్కై డైవింగ్(Sky Diving) చేసిన “వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్(One life.. One breath.. One jump)” అనే క్యాప్షన్‌తో తన సాహసం తాలూకు వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో అభిమానులతో పంచుకున్నారు. ఇక, స్కై డైవింగ్‌లో భాగంగా విమానంలో చాలా ఎత్తుకు వెళ్లాక అక్కడి నుంచి ఆమె సహాయకుడి సాయంతో పారాచూట్(ParaChut) వేసుకుని ధైర్యంగా కిందికి దూకేశారు. ఈ సాహసపూరిత జంప్ కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్(Viral)గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
View this post on Instagram






