బాలీవుడ్ టెలివిజన్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన నటి హీనా ఖాన్. హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ యే రిష్తా క్యా కెహ్లతా హై & కసౌతి జిందగీ కే ధారావాహికల్లో నటించిన మంచి గుర్తింపు నందుకుంది. హీనా తెలుగు ప్రేక్షకుల మదిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో ‘పెళ్లంటే నూరెళ్ల పంట’గా ప్రసారమైన ఈ సీరియల్ లో అక్షరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఇటీవల ఆమె స్టేజ్3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. కీమోథెరపీ, సర్జరీ, ఇమ్యూనోథెరపీ చికిత్సలు తీసుకుంటోంది. ఈ సమయంలో రాకీ ఆమెకు అండగా నిలిచాడు. హీనా -రాకీ 2009లో “యే రిష్తా క్యా కెహ్లాతా హై” సెట్స్‌లో కలిసారు, ఇక్కడ హీనా అక్షర పాత్ర పోషించగా, రాకీ సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. వారి స్నేహం ప్రేమగా మారింది.

ఈ క్రమంలో తాజాగా హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైస్వాల్(Rocky Jaiswal)ను రహస్యంగా వివాహం చేసుకున్నట్టు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. హీనా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ, “రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడం ద్వారా మేము ఒకే ప్రపంచాన్ని సృష్టించుకున్నాం” అంటూ హృదయాన్ని హత్తుకునే మెసేజ్‌ను పోస్ట్ చేశారు. “మేము మా మనోవేదనలన్నింటినీ చెరిపివేసి జీవితాంతం ఉండే బంధాన్ని ఏర్పరచుకున్నాం. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తాం” అంటూ రాకీపై ఉన్న ప్రేమను పంచుకుంది.
హీనా ఖాన్(Khan Secretly), రాకీ జైస్వాల్‌ల జంటపై అభిమానులు ప్రేమతో స్పందిస్తూ, శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. క్యాన్సర్ అనే గంభీరమైన సమస్యతో పోరాడుతున్న హీనా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని పేర్కొంటున్నారు. ఈ జంటకు జీవితంలో అన్ని ఆనందాలు కలగాలని అభిమానులు కోరుకుంటుంన్నారు.






