నటి కల్పిక (Kalpika) మరోసారి రచ్చ చేసింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్లో కల్పిక నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. మేనేజర్ ను బూతులు తిట్టి, దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో కల్పికపై పోలీసులు కేసు కూడా పెట్టారు. కేసు ఇంకా విచారణలో ఉంది. ఇది ఇలా ఉండగా కల్పిక మరోసారి రెచ్చిపోయింది. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ లో ఉన్న ఓ రిసార్ట్ లో రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసిరేసిన కల్పిక
మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లిన కల్పిక (Kalpika Ganrsh).. రిసెప్షన్ లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
అందుకే గొడవ పడాల్సి వచ్చింది..
ఈ అంశంపై కల్పిక స్పందించింది. తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని కల్పిక పేర్కొంది. ఈ వివాదంపై స్పందిస్తూ ఓ వీడియోని కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేసింది. రిసార్టులో మొబైల్ సిగ్నల్స్ రావడంలేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే తనతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడని పేర్కొంది. ఎంత నెమ్మదిగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్ తో గొడవ పడాల్సి వచ్చిందని తెలిపింది.
సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు
బ్రౌన్ టౌన్ రిసార్ట్ వివాదంపై స్పందించిన నటి కల్పిక
రిసార్టులో సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే నాతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడు
ఎంత నిదానంగా చెప్పినా… https://t.co/JxoCp9PSO2 pic.twitter.com/72LGDySZ3g
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025






