
Betting Apps Case: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ(ED hearing in betting apps case)కు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ఈడీ జోనల్ కార్యాలయానికి కాసేపటి క్రితమే ఆమె వెళ్లారు. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో ఆమె పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధింనున్నారు. ఈ కేసులో ఆమె తీసుకున్న పారితోషికం, కమీషన్లు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి నటులు ఈడీ ముందు తమ వివరణలు సమర్పించారు.
మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం
ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా అక్రమంగా కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ యాప్‌ల ప్రమోషన్‌లో సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు పాల్గొన్నారని, దీని వల్ల భారీ ఆర్థిక నష్టాలు సామాన్యులకు కలిగాయని ఆరోపణలు ఉన్నాయి. మంచు లక్ష్మి గతంలో ఈ యాప్‌లకు సంబంధించిన ప్రకటనల్లో నటించినట్లు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
36 మంది సినీ ప్రముఖులకు నోటీసులు
కాగా ఈడీ ఈ కేసును మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తూ, 36 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. విచారణలో ఆర్థిక డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది, భవిష్యత్తులో ఇలాంటి ప్రమోషన్లపై సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
After Daggubati Rana, Vijay Deverakonda, and Prakash Raj, actress Manchu Lakshmi appeared before the Enforcement Directorate in Hyderabad today in connection with an investigation into the alleged promotion of unauthorized online betting platforms. pic.twitter.com/SmArEt5D8F
— Vasudha Venugopal (@Vasudha156) August 13, 2025