నటి నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal) సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను చంపేస్తానని సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేధిస్తున్నాడని కు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని, ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, చంపేస్తానని కామెంట్స్ పంపిస్తున్నాడని నిధి అగర్వాల్ ఫిర్యాదులో పేర్కొంది. ఆ బెదిరింపుల కారణంగా తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని తెలిపింది. సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.
ప్రభాస్, పవన్ సరసన
నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన సవ్యసాచితో టాలీవుడ్(Tollywood)కు పరిచయమై నిధి అగర్వాల్ ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటిస్తున్న మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab)లో నిధి హీరోయిన్గా ఎంపికైంది. కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా వారిలో నిధి ఒకరు. మాళవిక మోహనన్, రిధి కూడా ప్రభాస్ సరసన నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu)లోనూ నిధి నటిస్తోంది. క్రిష్ సారథ్యంలో సాగుతున్న ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.






