ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur).. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టీవ్‌గానే కనిపిస్తుంటుంది. తన సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసేందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్(Director Trivikram Srinivas), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని చాలా సార్లు డైరెక్ట్‌గానే కుండబద్ధలు కొట్టింది. పైగా తరచూ వీరిద్దరి గురించి SMలో పోస్టులు చేస్తూనే ఉంటుంది. తనను మోసం చేశారని కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. అలాంటి పూనమ్ ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)ని కలిసి ఓ ఆర్ట్ వర్క్(Art Work) గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమరావతి స్ఫూర్తిని ప్రతిబింబించేలా..
హైదరాబాద్(HYD)లో ఆదివారం రాత్రి ఓ సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటి పూనమ్ కౌర్ సీఎం చంద్రబాబుకు ఓ స్పెషల్ గిఫ్ట్(Special Gift) అందించారు. అమరావతి స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఓ పటచిత్ర ఆర్ట్ వర్క్‌ను ఆయనకు బహూకరించినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘అన్నయ్యతో వదినమ్మ కలిసిపోయిందా’ ఏంటని పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
🙏🫶🇮🇳
Gifted a patachitra artwork which represents the essence of #amravati to none other than CM of Andhra Pradesh @ncbn #narachandrababunaidu garu 🙏
Jai hind 🫡 pic.twitter.com/zevdfvs1ZD
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 18, 2025
గతంలో పవన్, ఆయన ఫ్యామిలీపై పోస్టులు
ఇదిలా ఉండగా పూనమ్ సడన్‌గా ఇలా చేయడమేంటని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పైగా పవన్ అంటే పట్టని ఆమే ఏకంగా సీఎంను కలిసి గిఫ్ట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటోనని అనుమానిస్తున్నారు. కాగా పవన్ కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) అగ్నిప్రమాదంలో గాయపడినప్పుడు ఈ అమ్మడు “కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు” అంటూ పిచ్చి పోస్టులు వేసింది. ఇక ఆ వెంటనే “చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది. ఎవ్రీథింట్ అబౌట్ బెనిఫిట్స్” అంటూ మరో పోస్టు చేసిన విషయం తెలిసిందే.






