టాలీవుడ్ టాప్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashii Khanna).. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.’ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, అతి తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన రాశి.. ‘జోరు’, ‘శివం’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్ (Supreme)’, ‘హైపర్’, ‘జై లవ కుశ (Jai Lava Kusha)’, ‘తొలిప్రేమ’, ‘శ్రీనివాస కళ్యాణం’, ప్రతి రోజు పండగే’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
బాలీవుడ్లో తన మార్క్ యాక్టింగ్..
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే రాశి ఖన్నా.. బాలీవుడ్(Bollywood)లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రాలలో ‘మద్రాస్ కేఫ్’ (తొలి సినిమా), ‘యోధ’, ‘ది సబర్మతి రిపోర్ట్’ ముఖ్యమైనవి. వీటితో పాటు ‘ఫర్జీ'(Farzi) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అయితే, టాలీవుడ్లో లభించినంత విజయం బాలీవుడ్లో తనకు ఇంకా దక్కలేదు. అందులో ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు.
View this post on Instagram
ఫర్జీ-2 షూటింగులో ప్రమాదం..
రాశి ఖన్నా బాలీవుడ్లో ఫర్జీ వెబ్ సిరీస్ చేయగా.. దానికి కొనసాగింపుగా ఫర్జీ -2 (FARZI-2) షూటింగ్ జరుగుతున్నది. మొదటి పార్ట్‌లో తమిళ హీరో విజయ సేతుపతి.. బాలీవుడ్ యాక్టర్ షాహీద్ కపూర్ (Shahid Kapoor) లీడ్ రోల్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ విజయం సాధించగా.. దానికి కొనసాగింపుగా వస్తున్న మూవీ షూటింగులో భాగంగా రాశి ఖన్నాకు ప్రమాదం(Raashii Khanna Accident) జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా ఆమె ప్రకటించారు.
గాయాలను లెక్క చేయొద్దు
ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదని, షూటింగ్లో తనకు జరిగిన ప్రమాదంలో చిన్న చిన్న గాయాలు అయ్యాయని, దానికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు. అందులో రాశీ ఖన్నా మొహంపై, చేతులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ముక్కులో నుంచి కూడా రక్తం స్రవిస్తున్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని రాశి ఖన్నా అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా, తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ‘తెలుసు కదా (Telusu Kada)’ అనే సినిమాలో రాశి నటిస్తున్నారు.






