టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీ టౌన్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి సమంత ‘సిటడెల్ హనీ బన్నీ’ (citadel honey bunny) వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్, సమంత(Samantha) సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
ఈ చిట్ చాట్ లో ‘స్పైసీ రాపిడ్ ఫైర్’లో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరుణ్ ధావన్.. ‘‘అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?’’ అని సమంతను ప్రశ్నించగా.. ‘‘నా మాజీ (మాజీ భర్త నాగచైతన్య (Naga Chaitanya))కి ఇచ్చిన ఖరీదైన కానుకులు’’ అని చెప్పుకొచ్చింది. అయితే వరుణ్.. ‘‘ఎంత ధర ఉంటుంది?’’ అని అడగ్గా.. ‘‘కాస్త ఎక్కువే.. ఇక కొనసాగిద్దాం’’ అంటూ సామ్ ఆ టాపిక్ ను ముగించింది.
అయితే సమంత చేసిన కామెంట్స్ (Samantha Latest Comments) ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నారు. సమంత ఎవరి గురించి మాట్లాడారు అని కొందరు ఆరా తీస్తుంటే.. ఇంకొందరేమో ఇంకెవరు తన మాజీ భర్త నాగ చైతన్య గురించేనని ఇంకొందరు అంటున్నారు. ‘ఏం మాయ చేశావే’ (Em Maya Chesave) సినిమాలో తొలిసారి కలిసి నటించిన నాగచైతన్య, సమంత ఆ చిత్ర షూటింగు సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోయింది.
ఇక ‘సిటడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) విషయానికి వస్తే ఈ స్పై, యాక్షన్ థ్రిల్లర్ ను ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) ఫేమ్.. రాజ్ అండే డీకే తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 150 దేశాల్లో టాప్‌లో ఉంది.