బాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?

టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ శ్రీలీల (Sreeleela) ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ భామ పటౌడీ వారసుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చాయి. కానీ ఆ సినిమాలో వేరే స్టార్ కిడ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో కన్ఫామ్ అయింది. ఈ జంట ప్రధాన పాత్రల్లో అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ప్రేమలో కార్తీక్ శ్రీలీల

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కానీ మేకర్స్ ఈ జంట పాత్రలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కార్తీక్, శ్రీలీల చాలా ఇంటెన్స్ లవ్ లో ఉన్నట్లు కనిపించారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా టీ సిరీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అనురాగ్ బసు (Anurag Basu) సినిమాలో నటిస్తున్న కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ఇప్పుడు ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

కార్తీక్ ఫ్యామిలీ ఫంక్షన్ లో శ్రీలీల

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఎప్పుడు లైమ్ లైట్ లో ఉన్నా రిలేషన్షిప్ కు మాత్రం నో అని చెబుతూనే వచ్చింది. అయితే తాజాగా కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఫంక్షన్ లో శ్రీలీల కనిపించడం ఇప్పుడు పుకార్లకు తెరలేపింది. ఈ పార్టీలో శ్రీలీల డ్యాన్స్ చేయడం.. ఆ డ్యాన్స్ మూవ్స్ ను కార్తీక్ మొబైల్ లో క్యాప్చర్ చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో ఈ జంట డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ జంట ఈ పుకార్లపై క్లారిటీ ఇవ్వలేదు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *