తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్(Kalvakuntla Tharaka Rama Rao)పై, మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా హామీలు నెరవేరుస్తున్నాం
తెలంగాణ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా.. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. అతి త్వరలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Housing Scheme) సర్వేకు అధికారులు ప్రజల ఇళ్ల వద్దకే వస్తారని, గతంలో ప్రజాపాలన సమయంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకే అధికారులు వచ్చి యప్ లో వివరాలను నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఇళ్ల వీస్తీర్ణం 400 చదరపు అడుగులు తగ్గకుండా నిర్మించుకుంటే చాలని చెప్పారు. కానీ ఇంట్లో చిన్న కిచెన్, టాయిలెట్ తప్పకుండా ఉండాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తరతమ భేదాలు లేకుండా, పూర్తిగా నిష్పక్షపాతంగా అధికారులు చేపడతారని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్(BRS) కండువా మోసిన వారికే సంక్షేమ పథకాలు అందాయని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం పేదవారికి మాత్రమే సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తుందని స్పష్ఠీకరించారు.
నేను కేసీఆర్ కాళ్లు మొక్కిన
ఆదాని(Adani) కాళ్లు తాను పట్టుకున్నానని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాను, ఆ తరువాత మీ నాన్నగారైన కేసిఆర్ కాళ్లే మొక్కాను.. తండ్రితో సామనుడని భావించి అలా చేశాను.. కానీ అలాంటి నన్ను తడి గుడ్డతో గొంతు కోసినట్టు ఐదేళ్ల రాజకీయ జీవితం లేకుండా చేశారని’ విమర్శించారు. వ్యక్తి గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకునే నైతిక స్వభావం కేటీఆర్ కు లేదని అన్నారు.
ఒకే రోజులో విలేజ్ రెవెన్యూ అధికారులను(Village Revenue Officers) తీసేయడం వల్ల లాభం ఏం లేదని.. కచ్చితంగా రెవెన్యూ ప్రక్షాలను చేస్తామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.