అహ్మదాబాద్‌లో ఎయిరిండియా కూలిన ఘటన(Air India crash incident)లో మృతుల సంఖ్య 274కి చేరింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో ఉన్న 241 మంది ప్రయాణికులు(Passengers), సిబ్బంది మరణించగా.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని మెడికోలు(Medicos) 24 మంది మరణించారు. తాజాగా గాయపడిన మెడికోలలో మరో 9 మంది కన్నుమూయడంతో ఆ సంఖ్య 274కి చేరింది. కాగా ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్(Wing flap)లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఇండియాలో జరిగిన గగనతల ప్రమాదాల్లో పలువురు మరణించారు. వారు ఎవరో ఓసారి చూద్దామా..
🚨 🚨 #BreakingNews Ahmedabad Plane Crash Deaths Rise To 274, Include Those On Board And On Ground https://t.co/i93ShIw1Oc
At least 274 people were killed in one of India’s deadliest plane crashes involving a London-bound Air India flight in Ahmedabad earlier this week, sourc…
— Instant News ™ (@InstaBharat) June 14, 2025
విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించింది వీరే..
☛ సౌందర్య (2004): ప్రముఖ నటి, నిర్మాత అయిన సౌందర్య(Soundarya) ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె అమ్మోరు, సూర్యవంశం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన నటించారు.

☛ హోమీ జహంగీర్ బాబా (1966): భారత అణు శాస్త్రవేత్త, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 స్విస్ ఆల్ప్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కూలిపోవడంతో మరణించారు.
☛ సంజయ్ గాంధీ (1980): మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం వద్ద గ్లైడర్ ప్రమాదంలో మరణించారు.
☛ YS రాజశేఖర రెడ్డి (2009): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లాకు వెళుతుండగా నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.
☛ బిపిన్ రావత్ (2021): భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) బిపిన్ రావత్(Bipin Rawat) తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో భార్య మధులికతో సహా మరణించారు.

☛ మాధవరావ్ సింధియా (2001): కాంగ్రెస్ నాయకుడు, కాన్పూర్‌కు వెళుతుండగా సెస్నా విమానం కూలిపోవడంతో మరణించారు.
☛ జి.ఎం.సి. బాలయోగి (2002): టీడీపీ నేత, లోక్‌సభ స్పీకర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.
☛ ఓ.పి. జిందాల్ (2005): హరియాణా మంత్రి, పారిశ్రామికవేత్త, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
☛ సురేంద్ర నాథ్ (1994): హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యులతో సహా మరణించారు.
☛ తరుణి సచ్‌దేవ్ (2012): బాల నటి, నేపాల్‌లోని జోమ్సోమ్ విమానాశ్రయం సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో తల్లితో సహా మరణించారు.
☛ ఇందర్ ఠాకూర్ (1985): నటుడు, ఎయిర్ ఇండియా పర్సర్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు పేలుడు కారణంగా మరణించారు.
☛ సుభాష్ చంద్ర బోస్ (1945): ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, తైపీ నుంచి మంచూరియాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. అయితే ఆయన మరణంపై అధికారంగా క్లారిటీ లేదు.






