ప్రతి ఒక్కరూ ఒక రోజు చనిపోవాలి.. కానీ మనం ఎప్పుడు చనిపోతారో తెలిస్తే ఎలా ఉంటుంది? చాలా మంది మరణించిన రోజు, తేదీ, సమయం(Day, Date, Time of Death) తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. ఈ అసహనం కొత్తేమీ కాదు. శతాబ్దాలుగా ప్రజలు మరణం(Death) గురించి తెలుసుకోవడానికి ఎన్నోఇటు శాస్త్రవేత్తలు, అటు జ్యోతిష్కులు పలు విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు AI ఈ పనిని మరింత సులభతరం చేసింది. AI ఆధారంగా డెత్ క్లాక్(Death Clock) మనుషుల మరణాన్ని అంచనా వేస్తోంది. అవునండీ మీరు విన్నది నిజమే. దీని ద్వారా మనం ఎప్పుడు మరణిస్తామో తెలుసుకోవచ్చట. వినడానికి కాస్త కొత్తగా, భయంగానూ ఉందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆయుర్దాయం డేటా AIలో సేవ్ చేశారు
AI ఆధారిత యాప్‌లో డెత్ క్లాక్(AI powered Death Clock app) ఉంది. అయితే పెయిడ్ యూజర్లు(Paid Users) మాత్రమే దీని ప్రయోజనాన్ని పొందగలరు. ఈ డెత్ క్లాక్ జూలైలో ప్రారంభించినట్లు బ్లూమ్‌బెర్గ్(Bloomberg) ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది. బ్రెంట్ ఫ్రాన్సన్(Brent Franson) అనే వ్యక్తి ఈ డెత్ క్లాక్‌ను సృష్టించాడు. ఇప్పుడు మీ మదిలో వచ్చే మొదటి ప్రశ్న డెత్ క్లాక్ ఏ ప్రాతిపదికన మరణానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటుందనేగా.. బ్లూమ్‌బెర్గ్ డాటా ప్రకారం 53M మంది వ్యక్తుల 1,200 కంటే ఎక్కువ ఆయుర్దాయం డేటా AIలో సేవ్ చేశారు. ఈ డేటాను స్కాన్(Data Scan) చేయడం ద్వారా, డెత్ క్లాక్ వ్యక్తులు మరణించిన రోజు, తేదీని తెలియజేస్తుంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
సాంకేతికంగా అభివృద్ధి చేశారు
బ్లూమ్‌బెర్గ్(Bloomberg)తో సంభాషణ సందర్భంగా, డెత్ క్లాక్‌ను రూపొందించిన డెవలపర్ ఫ్రాన్సన్, డెత్ క్లాక్ ప్రజలను వారి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి స్థాయి, నిద్ర గంటలు వంటి ప్రశ్నలను అడుగుతుందని చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా డెత్ క్లాక్ ప్రజలు ఎంతకాలం జీవించి ఉంటారో తెలియజేస్తుంది. డెత్ క్లాక్ హెల్త్, ఫిట్‌నెస్ విభాగంలో అగ్రస్థానంలో ఉంటుంది. దీనితో పాటు, డెత్ క్లాక్ కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందింది. డెత్ క్లాక్‌ని ఉపయోగించడానికి, ఈ యాప్(App) సంవత్సరానికి 40 డాలర్లు వసూలు చేస్తుంది. 40 డాలర్లు అంటే రూ.3,400 చెల్లించడం ద్వారా, మీరు మీ మరణాన్ని అంచనా వేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి..
An artificial intelligence AI powered death clock has captured attention for its ability to predict when an individual might die. The developer of this apps Brent franson launched in July last year analyses personal data such as age, weight, height, food habits to predict date.
— Kateng Apa (@KatengApa) December 6, 2024








