స్వర్గంలో మన్మోహన్ సింగ్.. వీడియో చూశారా?

Mana Enadu : భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఇక లేరు. గురువారం రాత్రి ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా భారతదేశం మొత్తం దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటోంది. రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులు మన్మోహన్ ను తలచుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మాజీ ప్రధానికి భారీ ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నెట్టింట ఆయనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

స్వర్గంలో మాజీ ప్రధాని

స్వర్గంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంటూ ఓ వీడియో (Manmohan Singh in Heaven) ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మన్మోహన్ వీల్ ఛైర్ లోనే స్వర్గానికి వెళ్లడం మనం చూడొచ్చు. పూర్తిగా తెల్ల దుస్తులు ధరించిన ఆయన, బ్లూకలర్ తలపాగాతో ఆకర్షణీయంగా కనిపించారు. ఇక వీల్ ఛెయిర్ నుంచి లేచి నమస్కరిస్తున్నట్లుగా ఈ వీడియో ఉంది. ఇక చివరలో రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్ సింగ్ అనే టైటిల్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

వాజ్ పేయీతో మన్మోహన్

దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh AI Video) ఇక మన మధ్య లేరని భావిస్తున్న సమయంలో ఈ వీడియో చూస్తుంటే బాధగా ఉందని నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఇదే కాకుండా ఇప్పటికే మరణించి స్వర్గానికి చేరుకున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం (Abdul Kalam Manmohan Singh)లను మన్మోహన్ కలిసి వారితో ముచ్చటిస్తున్నట్లు కూడా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *