కేన్స్ (Cannes Film Festival) వేడుకల్లో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుతో, నుదుటిన సిందూరంతో ఎర్ర తివాచీపై అందరి దృష్టిని ఆకర్షించారు. ఫ్రాన్స్లో 78వ కేన్స్ చిత్రోత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. మంగళవారం జాన్వీ కపూర్ హాజరై ఆకట్టుకోగా.. బుధవారం ఐశ్వర్య హాజరయ్యారు.
హాఫ్ వైట్ కలర్ జరీ అంచు బెనారసీ చీర, మెడలో హారాలు
2002లో తొలిసారి చిత్రోత్సవాల్లో మెరిసిన ఐశ్వర్య.. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ వేడుకల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ సంవత్సరం హాఫ్ వైట్ కలర్ జరీ అంచు బెనారసీ చీర, టిష్యూ డ్రేప్, మెడలో హారాలు.. ఇలా రాయల్ లుక్‌లో ఐష్ కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే, ఈ సందర్భంగా ఆమె నుదుటిన పెట్టుకున్న ‘సిందూరం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని వెనుక రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
విడాకుల రూమర్లకు చెక్ పెట్టేలా..
గత నెలలో జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు (operation sindoor) కేన్స్ వేదికగా తన లుక్‌తో మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని నెలలుగా ఐశ్వర్య–అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న రూమర్లకు తన లుక్‌తో చెక్ పెట్టారామె. కేన్స్‌కు నుదుట సిందూరంతో హాజరై అభిషేక్‌పై ఉన్న ప్రేమను ఐశ్వర్య తెలియజేశారని నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.






