క్వీన్ ‘ఐశ్వర్య రాయ్​’కి​ అరుదైన గౌరవం

Mana Enadu :  బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్​ ( Aishwarya rai) అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరుగుతున్న కొద్ది ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరడం లేదు. ఆమె అందానికే కాదు.. తెలివికి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఈ బ్యూటీకి కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగానూ చాలా పాపులారిటీ ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఈ భామను నటనలోనే కాకుండా ఫ్యాషన్ పరంగా కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు.

ఐష్ లెహంగాకు అరుదైన గౌరవం

చాలా మంది అమ్మాయిలు ఐష్ డ్రెస్సింగ్ ను ఫాలో అవుతంటారు. తాజాగా ఈ భామ డ్రెస్సింగ్ ఓ అరుదైన గౌరవం దక్కింది.  2008 విడుదలై సూపర్​ హిట్​ మూవీ ‘జోధా అక్బర్‌ (Jodhaa Akbar Movie)’ గురించి తెలియని వారుండరు. హృతిక్ రోషన్ తో జంటగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య ధరించిన లెహెంగాలు ఇప్పటికీ ఫేమసే. ఆ లెహంగాల కోసమే చాలా మంది అమ్మాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య ధరించిన ఓ లెహంగా ఇప్పుడు అరుదైన గౌరవం దక్కించుకుంది.

అకాడమీ మ్యూజియంలో ఐష్ లెహంగా

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియం (Academy Museum)లో జోధా అక్బర్ లో ఐశ్వర్య ధరించిన రెడ్ కలర్ లెహంగాను ఉంచనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అకాడమీ తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టింది. “జోధా అక్బర్ సినిమాలో రాణికి ఈ లెహెంగా మరింత అందాన్ని తెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మందిని అట్రాక్ట్ చేసిన ఈ  లెహెంగానూ ప్రముఖ ఆస్కార్‌ మ్యూజియంలో ప్రదర్శించనున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది” అని అకాడమీ తమ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది.

ఇంతకంటే అందాన్ని కనిపెట్టగలరా?

ఇక ఈ పోస్టు చూసి ఐష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాణికి క్వీన్ మూమెంట్ ( Aishwarya rai Queen Moment) అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. “డియర్‌ హాలీవుడ్‌ ఇంతకుమించిన అందాన్ని కనిపెట్టండి చూద్దాం” అంటూ ఓ నెటిజన్ సవాల్ విసరగా..  “అకాడమీ మ్యూజియం ఇకపై మరింత అందంగా కనిపిస్తుంది” అంటూ మరొక నెటిజన్ స్వీట్ కామెంట్ చేశాడు. అకాడమీ మ్యూజియంలో కనిపించనున్న మొదటి ఇండియన్‌ డ్రెస్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ లెహెంగాను నీతా లుల్లా అనే డిజైనర్ డిజ్ చేశారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *