తమిళ స్టార్ హీరో అజిత్ (Ajit) కొత్త ఏడాది రోజునే తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి తన సినిమాతో అలరిస్తారని చెప్పిన ఆయన తాజాగా పండుగ రేసు నుంచి తొలిగారు. ఆయన అప్‌కమింగ్ మూవీ ‘విడాముయార్చి(vidaamuyarchi )’ సంక్రాంతి బరిలో నుంచి వైదొలిగనట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ‘అనుకోని కారణాల వల్ల ‘విడాముయార్చి’ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నాం. త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పేర్కొంది.
Wishing everyone a Happy New Year 2025! 😇✨
Due to unavoidable circumstances, the release of VIDAAMUYARCHI is postponed from PONGAL! Kindly stay tuned for further updates! The wait will be worth it! 🙏🏻#Vidaamuyarchi #HappyNewYear pic.twitter.com/Xxt7sx1AMY
— Lyca Productions (@LycaProductions) December 31, 2024
ఇక ‘విదాముయార్చి’ సినిమా సంగతికి వస్తే మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ కుమార్, త్రిష (Trisha) కలిసి నటిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఇక సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తుంది అనుకుంటే అనూహ్యంగా బరిలో నుంచి తప్పుకుంది.
మరోవైపు ఈ ఏడాది సంక్రాంతి (Sankranti Movies) బరిలో టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 10వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో రానున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’గా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. విక్టరీ వెంకటేశ్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ జనవరి 14వ తేదీన పండుగ సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.






