తమిళనాట రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్ (Ajith Kumar). దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విడాముయార్చి. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఫిబ్రవరి 6 గురువారం తమిళంతో పాటు తెలుగులో ‘పట్టుదల (Pattudala)’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని అవాంతరాల అనంతరం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. డైరెక్టర్ మాగిజ్ తిరుమనేని(Magij Thirumaneni) తెరకెక్కించిన ఈ మూవీలో అజిత్‌కు జోడీగా స్టార్ నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) నటించింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఐదు భాషల్లో ఓటీటీలోకి..
కాగా ‘పట్టుదల’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. సోమవారం (మార్చి 3వ) నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసింది. తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది. కాగా థియేటర్లలో రిలీజైన 26 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.
‘పట్టుదల’ స్టోరీ ఏంటంటే..
ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్జున్ (Ajith Kumar), కాయల్ (Trisha ) దంపతులు.. అజర్‌బైజాన్‌లో జీవిస్తుంటారు. పన్నెండేళ్ల వీరి వైవాహిక బంధంలో మనస్పర్ధలు వస్తాయి. దాంతో భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్న కాయల్.. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని భావిస్తుంది. అయితే చివరి ప్రయాణంగా భావించి కాయల్‌ను తన కారులోనే డ్రాప్ చేయాలని అర్జున్ అనుకుంటాడు. అయితే వారి ప్రయాణంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత కాయల్ మిస్ అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్ ఎలాంటి రిస్క్ చేస్తాడు? కథలో రక్షిత్ (Arjun), దీపిక (Regina) పాత్ర ఏంటి? అసలు కాయల్ కు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.






