ఇంగ్లండ్(England)పై చారిత్రక టెస్టు విజయం సాధించిన వేళ, టీమిండియా(Team India) పేసర్ ఆకాశ్ దీప్(Akash deep) తన ఆనందాన్ని పంచుకోలేదు, గుండెల్లో దాచుకున్న భారాన్ని పంచుకున్నాడు. తాను మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పుడు తన సోదరి క్యాన్సర్(Cancer)తో పోరాడుతోందన్న నిజాన్ని ప్రపంచానికి వెల్లడించి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. ఎడ్జ్‌బాస్టన్(Edgebaston)లో ఇంగ్లండ్‌పై సాధించిన చిరస్మరణీయ విజయాన్ని తన సోదరికి అంకితం(Dedicated to sister) ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం: దీప్
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆకాశ్ దీప్ తీవ్ర భావోద్వేగానికి(Emotional) లోనయ్యాడు. “ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం(Health) నిలకడగా ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం ఇస్తున్నా. ఆమె ముఖంలో చిరునవ్వు(Smile) చూడాలనుకుంటున్నాను” అని తెలిపాడు. గద్గద స్వరంతో, “ఇది నీకోసమే. నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ నీ ముఖమే నా మదిలో మెదిలింది. మేమంతా నీతోనే ఉన్నాం” అని అన్నాడు.
WE ALL ARE WITH YOU SISTER.♥️#shubhmangill#ENGvsIND #AkashDeep pic.twitter.com/LdbAnaTKH8
— India matters (@Indiamattars12) July 7, 2025
చేతన్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన ఆకాశ్
కాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆకాశ్ దీప్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు సహా మొత్తం 187 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో 1986లో చేతన్ శర్మ (10/188) నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ టెస్ట్ గణాంకాలు(Best Figures) ఇవే కావడం విశేషం. అంతేకాకుండా ఇంగ్లండ్‌లో 10 వికెట్ల ఘనత సాధించిన రెండో భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని ప్రదర్శన భారత్‌కు ఎడ్జ్‌బాస్టన్‌లో మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించింది. కాగా ఈ మ్యాచులో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.






