Kubera Trailer: శేఖర్ కమ్ముల మార్క్ చూపించాడుగా.. ‘కుబేర’ ట్రైలర్ ఇదిగో..

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాగ్, ధనుష్ తొలిసారి తెరపై కనిపిస్తుండటంతో ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాలోని కీలక అంశాలను, పాత్రల తీరుతెన్నులను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రెట్టింపు చేసింది.

Kubera: Teaser of Dhanush, Nagarjuna, and Rashmika Mandanna starrer to drop  on November 15 : Bollywood News - Bollywood Hungama

డబ్బు చుట్టూ తిరిగే కథలో..

ఇక 2 నిమిషాల 38 సెకన్లున్న ఈ ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్(DSP) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. శేఖర్ కమ్ముల మార్క్ భావోద్వేగాలతో పాటు, యాక్షన్ సీన్స్(Action scenes) మూవీకి హైలైట్‌గా నిలవనున్నాయని ట్రైలర్ స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా, డబ్బు(Money) చుట్టూ తిరిగే కథలో మానవ సంబంధాలు, నైతిక విలువలు ఎలా ప్రభావితమవుతాయనేది ఆసక్తికరంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మనీ చుట్టూ సాగే కుబేర ట్రైలర్‌ని మీరూ చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *