నాగచైతన్య ‘తండేల్’ సక్సెస్.. నాగార్జున ఎమోషనల్ పోస్టు

అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) నుంచి ప్రస్తుతం ఉన్న హీరోలకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ లకు హిట్ పడి చాలా ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో వరుస ఫ్లాపుల తర్వాత నాగచైతన్య నుంచి వచ్చిన సినిమా ‘తండేల్ (Thandel)’. ఈ చిత్రం రిలీజ్ కు ముందు నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.

పైరసీ వచ్చినా థియేటర్ కే జై

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అయింది. మొదటి గంట నుంచే పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇక చిత్రం విడుదలైన 24 గంటలకు ఈ సినిమా HD ప్రింట్ ఆన్ లైన్ రిలీజ్ అయి మేకర్స్ కు షాక్ ఇచ్చింది. పైరసీ ప్రభావంతో తండేల్ కలెక్షన్లకు గండిపడినట్లే అని అంతా భావించారు.

నాగార్జున ఎమోషనల్ పోస్టు

కానీ కంటెంట్ ఉంటే HD ప్రింట్ పైరసీ ఆన్ లైన్ (Thandel HD Version) లో లభించినా థియేటర్ కే వెళ్లి సినిమా చూస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తండేల్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలా చాలా రోజుల తర్వాత చైతూ ఖాతాలో ఓ హిట్ పడింది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, అక్కినేని నాగార్జున (Nagarjuna) తండేల్ సక్సెస్ పై సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు.

గర్వంగా ఉంది చైతూ..

“నాగచైతన్య.. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. ‘తండేల్‌ (Thandel Success)’ మరో సినిమా మాత్రమే కాదు. ఇది నీ ఎనలేని అభిరుచికి, నీ కృషికి, పెద్ద కలలు కనే ధైర్యానికి నిదర్శనం. అక్కినేని అభిమానులందరు ఓ కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్‌ విజయం మనందరిదీ. మీ అంతులేని ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. అల్లు అరవింద్, బన్నీ వాసుకు థాంక్యూ. సాయిపల్లవి అద్భుతమైన టాలెంట్‌ అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. మరిచిపోలేని ఈ విజయాన్ని అందించిన చందూ మొండేటి (Chandu Mondeti), రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌, అద్భుతమైన తండేల్‌ బృందానికి అభినందనలు.” అని నాగార్జున ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *