ప్రతిష్ఠాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్(Tennis Grand Slam Wimbledon)లో డిఫెండింగ్ ఛాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు. టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసి ప్రీక్వార్టర్స్(Pre-quarters)లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో అల్కరాజ్ 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్(John Leonard Struff)ను చిత్తు చేశాడు. టోర్నీలో పోరాటాన్నే నమ్ముకున్న అల్కరాజ్ ఈ మ్యాచ్‌లోనూ అతనికి ప్రత్యర్థి నుంచి కాస్త పోటీతప్పలేదు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసినా రెండో సెట్ ప్రత్యర్థి నెగ్గడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
Alcaraz Extends Wimbledon Streak to 17, Aims for Third Title
Defending champion Carlos Alcaraz defeated Jan-Lennard Struff 6-1, 3-6, 6-3, 6-4 on Centre Court, extending his Wimbledon winning streak to 17 matches and his overall streak to 21. The 22-year-old Spaniard, a five-time… pic.twitter.com/H2zl0dPM17
— Xtagrams (@xtagrams) July 5, 2025
అయితే, మిగతా రెండు సెట్లలో అల్కరాజే పైచేయి సాధించాడు. అయితే, నాలుగో సెట్‌లో ఒక దశలో 4-3తో వెనుకబడిన స్థితి నుంచి పుంజుకున్నాడు. వరుసగా మూడు గేముల్లో గెలిచి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open), US ఓపెన్ మాజీ ఛాంపియన్ నవోమి ఒసాకా(Japan) మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. ఆమెకు 6-3, 4-6, 4-6 తేడాతో రష్యా క్రీడాకారిణి పావ్లియుచెంకోవా(Pavlyuchenkova) షాకిచ్చింది.






