తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో నేటి (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్(Salaries Increase Demand)తో నిరసన చేస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu Film Industry Employees Federation) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది, ఇప్పటివరకు నిర్మాతల(Producers)తో చర్చలు విఫలమవడంతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటన ప్రకారం, వేతన పెంపునకు అంగీకరించిన నిర్మాతల సినిమాల షూటింగ్స్ కూడా బంద్ అయ్యాయి. శుక్రవారం నుంచే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Film Chamber of Commerce), ఫెడరేషన్(Federation)కు సహకరించకుండా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల రవితేజ(Raviteja) నటిస్తున్న మాస్ జాతర(Mass Jathara) వంటి సినిమాల షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది, దీంతో రిలీజ్ షెడ్యూల్స్ ఆలస్యం కావచ్చు.
సమస్య పరిష్కారం కాకపోతే ధర్నాకు దిగే అవకాశం
ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(AP Cinematography Minister Kandula Durgesh)తో నిర్మాతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), నాగ వంశీ, మైత్రీ రవి శంకర్ తదితరులు పాల్గొంటారు. కార్మికులు 30% వేతన పెంపుతో పాటు, రోజువారీ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు మూడేళ్లలో 25% పెంపునకు అంగీకరించినప్పటికీ, ఫెడరేషన్ ఈ షరతులను తిరస్కరించింది. ఈ సమ్మె వల్ల టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లపై తీవ్ర ప్రభావం పడనుంది. సమస్య పరిష్కారం కాకపోతే, కార్మికులు ధర్నాకు దిగే అవకాశం ఉంది.






