ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రూ. 101.4 కోట్ల రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసు(Ramakrishna Electronics Bank Scam Case)లో ఆయన్ను ఈడీ అధికారులు మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ విషయంపై అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. తాను 2017లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ లావాదేవీలో ఒక మైనర్ వాటాదారుడు బ్యాంక్ లోన్ తీసుకొని దాన్ని చెల్లించలేకపోయాడని, ఈడీ దర్యాప్తులో ఆ వాటాదారుడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో తన పేరు కనిపించడంతో విచారణకు పిలిచినట్లు వెల్లడించారు.
#Hyderabad—#AlluAravind clarifies on ED appearance: “Just Gave Explanation, Nothing More”
“I bought a #property in 2017 that had a minor shareholder with ED issues due to unpaid #bankloans. As my name was in the books, #ED called me. I went as a responsible #citizen and… pic.twitter.com/K2unMPygPU
— NewsMeter (@NewsMeter_In) July 4, 2025
బాధ్యతగల పౌరుడిగా ఈడీకి సహకరించాను..
“నేను బాధ్యతగల పౌరుడిగా ఈడీకి సహకరించాను. మీడియాలో ఈ విషయాన్ని తప్పుగా చూపించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు చెప్పలేను” అని ఆయన అన్నారు. కాగా ఈ కేసు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఫిర్యాదు మేరకు ఈడీ ఈ కేసును చేపట్టింది. అల్లు అరవింద్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రాపర్టీ కొనుగోళ్లపై అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈడీ అధికారులు ఆయన్ను వచ్చే వారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.






