
టాలీవుడ్(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో మరణించారు. ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ వార్త అల్లు కుటుంబాన్ని, సినీ పరిశ్రమను శోక సముద్రంలో ముంచెత్తింది. కనకరత్నమ్మ గారి భౌతికకాయాన్ని ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించారు. ఆమె అంత్యక్రియలు(funeral) శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి.
OM Shanti #AlluKanakaratnam garu 🙏💐 pic.twitter.com/jGue4Mhc5u
— RamCharan Domain (@RamcharanDomain) August 30, 2025
షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు బన్నీ, చెర్రీ
ఈ మేరకు అల్లు అర్జున్(Allu Arjun), రామ్‌చరణ్(Ram Charan)లు తమ షూట్‌లను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్ ముంబైలో అట్లీ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో ఉండగా, రామ్‌చరణ్ మైసూర్‌లో ‘పెద్ది(Peddi)’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. చిరంజీవి(Chiranjeevi) అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబు(Nagababu) విశాఖపట్నంలో జరుగుతున్న సభ కారణంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. కనకరత్నమ్మ గారు అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah)కు జీవిత భాగస్వామిగా, కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
#AlluArjun𓃵 back to his home from Mumbai as his grandmother #AlluKanakaratnam Passed Away pic.twitter.com/zJ9S28nuP0
— Ramesh Pammy (@rameshpammy) August 30, 2025
అత్తయ్య మరణం బాధాకరం: చిరంజీవి
అల్లు కనకరత్నమ్మ మరణంపై మెగాస్టార్ చిరంజీవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.
మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) August 30, 2025