పుష్ప-2తో పాన్ ఇండియా(Pan India) రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ స్టార్డమ్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్లడమే టార్గెట్‌గా తన తర్వాతి సినిమాలను ఎంచుకుంటున్నాడు. అందుకే తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్(Trivikram)ను కూడా కాదనుకుని తమిళ్ దర్శకుడు అట్లీ(Atlee)తో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించబోతోన్న ఈ అతి భారీ బడ్జెట్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నాలజీ(Hollywood Technology)ని వాడుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసమే 6నెలల వరకూ టైమ్ తీసుకుంటున్నారు.
మార్వెల్, DC బ్యానర్స్ రేంజ్‌లో..
ఇక ఈ మూవీ గురించి ముందు నుంచీ వినిపించేది ఏంటంటే.. మార్వెల్, DC బ్యానర్స్ రేంజ్‌లో ఇదీ ఓ సూపర్ హీరో సినిమా అంటున్నారు. సూపర్ మేన్(Super Man), బ్యాట్‌మేన్, ఐరన్ మేన్, స్పైడర్ మేన్ లాంటి వాళ్లు ఎలాగైతే దేశాలను రక్షిస్తుంటారో.. అల్లు అర్జున్ కూడా ఆ రేంజ్‌లో సూపర్ హీరోలా కనిపించబోతున్నాడు అని సినీ వర్గాలు అంటున్నాయి. ఇండియా నుంచి క్రిష్(Krish) తర్వాత అలాంటి మూవీ రాలేదు. క్రిష్ 4కే రంగం సిద్ధం అవుతోంది. ఆలోపే అల్లు-అట్లీ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

డిఫరెంట్ ఫేస్‌తో..
మరి ఈ సూపర్ హీరోకు ఓ సెపరేట్ ఫేస్ ఉంటుంది కదా. వారి రెగ్యులర్ ఫేస్‌తో కనిపించరు. వారికి మనుషులను దాటి అతీతమైన శక్తులు అనేకం ఉంటాయి. అందుకే డిఫరెంట్ ఫేస్(Different face)తో కనిపిస్తారు. ఆ శక్తులు వాడనప్పుడు మళ్లీ మామూలుగానే ఉంటారు. అలా ఐకన్ స్టార్ కోసం ఈ ఫేస్‌ను వాడతారు అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆ మధ్య హాలీవుడ్ VFX స్టూడియోకు వెళ్లినప్పుడు పరిశీలించారు. దీన్నే అల్లు అర్జున్ సూపర్ హీరో ఫేస్‌గా వాడతారు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఫేస్ పుష్పరాజ్‌కు ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






