పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్( Allu Arjun) తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ (Trivikram) సినిమాను పక్కన పెట్టి.. షారుఖ్తో జవాన్ తెరకెక్కించి భారీ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో జోడీ కట్టాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకొణెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే బన్నీ తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ యాక్టర్ కమ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
విలక్షణ బాసిల్ జోసెఫ్తో..
మరో నాలుగు నెలల్లో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ రాబోతుందని ఇటీవల బన్నీవాస్ పేర్కొన్న విషయం తెలిసిందే. అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ కాంబో అల్లు అర్జున్–బాసిల్ జోసెఫ్ (Basil Joseph) అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ జోసెఫ్తో అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ జయ జయ జయహే, సూక్ష్మదర్శిని, పోన్మాన్, మరణమాస్ లాంటి ప్రత్యేక సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు బాసిల్. ఈ సినిమాలు తెలుగులోనూ విడుదలవడంతో ఇక్కడి ప్రేక్షకులకు బాసిల్ దగ్గరయ్యాడు. ఆయన దర్శకత్వంలో చివరి మూవీ 2021లో వచ్చిన మిన్నల్ మురళీ (Minnal Murali) భారీ విజయాన్ని అందుకుంది.
భారీ ఫ్యాన్ బేస్ను దృష్టిలో పెట్టుకొని..
యాక్టింగ్పై దృష్టిపెట్టి దర్శకత్వానికి గ్యాప్ తీసుకున్న బాసిల్ జోసెఫ్.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేరళలో అల్లు అర్జున్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ను దృష్టిలో పెట్టుకొని ఓ పకడ్బందీ కథను రూపొందించి.. ఆయనకు వినిపించారని, బన్నీ కూడా గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్ర వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మరో నాలుగు నెలలో అధికారికంగా మేకర్స్ ఈ సినిమాను ప్రకటించనున్నట్లు సమాచారం.
BUZZ 🚨#AlluArjun is said to be doing a film with Malayalam director Basil Joseph under Geetha Arts.
If this is true, Bunny’s next three films will be with Atlee, Basil Joseph, and Prashanth Neel, though plans can still change! pic.twitter.com/JqevMFifQ9
— Movies4u Official (@Movies4u_Officl) June 12, 2025






