పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ భారీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. AA22xA6 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో బన్నీ పోషించే రోల్స్కు సంబంధించి కొన్నిరోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పడు మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. రెంఉ క్యారెక్టర్లు, కాదని మొత్తం నాలుగు పాత్రలు పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మూడు తరాలకు చెందిన నలుగురి వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాత, తండ్రి, ఆయన ఇద్దరు కుమారులుగా అల్లు అర్జున్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదే నిజమైతే.. బన్నీ ఇలా భిన్నమైన రోల్స్ తొలిసారి నటించినట్లు అవుతుంది.
పునర్జన్మల కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ సినిమాగా..
పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ ఫిక్షన్ సినిమాగా AA22xA6 రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్. అందులో ఒకరు దీపికా పదుకొణె (Deepika Padukone) అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన హీరోయిన్స్గా జాన్వీకపూర్ (), మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. మూవీలో ఓ కీ రోల్ కోసం హాలీవుడ్కు చెందిన ఓ అగ్ర హీరోను మూవీ టీమ్ సంప్రదించినట్టు తెలుస్తోంది.
ముంబైలో మూడు నెలలపాటు షూటింగ్
మూవీ తొలి షెడ్యూల్‌ను ముంబైలో చిత్రీకరించనున్నారట. మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో యాక్షన్ సీన్స్ తీయనున్నారట. ప్రత్యేకంగా వేసిన బ్లూ-మ్యాట్ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరగనున్నట్లు సమాచారం.






