ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న బాలుడు శ్రీతేజ్ (Sri Tej)ను ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్లు తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఉన్నారు. బన్నీ రాకతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Bunny Anna 🥺🩷#AlluArjun pic.twitter.com/soKgxHyG2f
— 𝙑 𝙆 (@AlluArjunCult09) January 7, 2025
గంటలోపు వెళ్లాలి
కిమ్స్ (KIMS Hospital)కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్‌పేట పోలీసులు అల్లు అర్జున్ (Allu Arjun Notices) కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసుపత్రికి వచ్చిన గంట లోపు తిరిగి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. సందర్శన అంతా గోప్యంగా ఉంచాలని.. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని ఇందుకు సహకరించాలని చెప్పారు. ఈ నిబంధనలు పాటించకుండా అకస్మాత్తుగా సందర్శనకు వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసుల సూచనల మేరకే అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు.
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun leaves from KIMS hospital, Begumpet after visiting Sri Teja who was injured in the Sandhya theatre incident. pic.twitter.com/P83efBBES0
— ANI (@ANI) January 7, 2025
ఇదీ జరిగిన విషయం
పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) కు అల్లు అర్జున్ తన కుటుంబం, హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బన్నీకి రెగ్యులర్ బెయిల్
అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చిన పోలీసులు ఆయణ్ను అరెస్టు (Allu Arjun Arrest) చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. బన్నీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత అధికారులు ఈ ఘటనలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. పోలీసుల సూచన మేరకు బన్నీ విచారణకు హాజరయ్యాడు. ఇక ఇటీవలే నాంపల్లి కోర్టు (Nampally Court) షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.







