Mana Enadu : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్.. నీయమ్మ తగ్గేదేలే’ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన డైలాగ్ ఆయణ్ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. టాలీవుడ్ హీరోను పాన్ ఇండియా స్టార్ చేసింది. పుష్ప పార్ట్-1లో ఆయన నటనకు ఏకంగా జాతీయ అవార్డు దరిచేరింది. ఇక ఇప్పుడు ‘పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’ అంటూ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన ఫైర్ ను చూపించేందుకు వస్తున్నాడు అల్లు అర్జున్.
డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 రిలీజ్ అవుతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కు రెండ్రోజులే ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో జోరు పెంచింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా పుష్పరాజ్ హవాయే కనిపిస్తోంది. ఇక రిలీజ్ కు ముందే పుష్పరాజ్ తన జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మరి సినిమా విడుదలకు ముందే ‘పుష్ప2’కు వచ్చిన రికార్డులు (Pushpa 2 Records) ఒకసారి చూద్దాం..
విడుదలకు ముందే పుష్ప క్రియేట్ చేసిన రికార్డులివే..
- పుష్ప-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. (ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్). ఇలా బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది.
- ‘పుష్ప2’ ట్రైలర్ (Pushpa 2 Trailer).. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ రిలీజ్ అయిన 15 గంటలలోపు 40 మిలియన్ల న్యూస్ పొందిన ఫస్ట్ సౌతిండియన్ మూవీ ట్రైలర్‌గా మరో రికార్డు సృష్టించింది.
- ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా యాభైవేల టికెట్స్ సేల్ (Pushpa 2 Pre Sales) అయిన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది.
- అమెరికాలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది.
- 24 గంటల్లో ‘పుష్ప2’ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. బాలీవుడ్‌లో ఆల్ టైమ్ టాప్ మూవీస్ లో పుష్పరాజ్ మూడో స్థానంలో నిలిచాడు.
- హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదైన తొలి ఈవెంట్‌గా పట్నాలో జరిగిన ‘పుష్ప-2 (Pushpa 2 Patna Event)’ తొలి ఈవెంట్ నిలిచింది.
- పుష్ప-2 ఐటెం సాంగ్ 18 గంటల్లోనే 25+ మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది.
- ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప-2 సినిమా తొలిరోజు రూ.303 కోట్లు వసూళ్లు చేయొచ్చని అంచనా. ఇది నిజమైతే రూ.300 కోట్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేయడం ఖాయం.