అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్లలో రిలీజై ఏకంగా రూ.1800 కోట్లు వసూళ్లు చేసి హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ.. తర్వాత ఓటీటీలోనూ సంచలనాలు రేపింది. రిలీజైన కొన్ని కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీని విశేషంగా ఆదరించారు. దీంతో తాజాగా పుష్ప 2 బాలీవుడ్‌లో మరో రికార్డు సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేయగా.. దేశవ్యాప్తంగా ఏకంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ (3.9) కంటే ఎక్కువ కావడం విశేషం.
టీవీల్లో వీక్షించిన 5.4 కోట్ల హిందీ జనాలు!
థియేటర్లతో పాటు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా చాలా హిందీ చిత్రాల్ని టీఆర్పీ విషయంలో ‘పుష్ప-2’ దాటేయడం విశేషం. టీవీల్లో మొత్తం 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాని చూసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక జూన్ 29న రీలోడెడ్ హిందీ వెర్షన్‌ని టీవీలో ప్రసారం చేయనున్నారు. దీంతో ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
అట్లీ దర్శకత్వంలో..
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun).. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. దీపికా పదుకొణెని (Deepika Padukone) హీరోయిన్‌గా ప్రకటించింది చిత్ర బృందం. మృణాల్, జాన్వీ కపూర్ను కూడా ఈ మూవీలో తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.






