చాలా మంది తమిళ హీరోలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. మార్కెట్ తో పాటు సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. ధనుశ్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలకే కాకుండా.. సూర్య (Suriya), కార్తి, శివ కార్తికేయన్ వంటి టైర్ 2 హీరోలకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే వాళ్లు నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. తాజాగా నటుడు శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) నటించిన అమరన్ మూవీని భాషలకతీతంగా ప్రేక్షకులు అలరిస్తున్నారు.
ఓటీటీలోకి అమరన్ మూవీ
2014లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadarajan) జీవిత కథతో రూపొందిన ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించిన ‘అమరన్ (Amaran)’ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అయితే పండుగ సమయంలో థియేటర్ లో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారంతా ఎప్పుడెప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు.
ఆరోజే అమరన్ స్ట్రీమింగ్
తాజాగా వారి ఎదురుచూపులకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్, డేట్ ను రిలీజ్ చేశారు. డిసెంబరు 5వ తేదీ నుంచి అమరన్ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Amaran Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
అమరన్ స్టోరీ ఇదే:
చిన్నప్పటి నుంచే సైనికుడు కావాలనేది ముకుంద్ వరదరాజన్ (Shiva Karthikeyan Amaran) కల. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి)ను ప్రేమిస్తాడు. ఇంతలో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారి ఉద్యోగం వస్తుంది. ట్రైనింగ్ అనంతరం 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో విధుల్లో చేరతాడు.
ముకుంద్ ఫ్యామిలీ వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కానీ ఇంది ఫ్యామిలీ ఒప్పుకోరు. అయినా పట్టు వదలకుండా ఇందు కుటుంబసభ్యుల్ని ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటవుతారు. మరి ముకుంద్-ఇందూల వైవాహిక జీవితం ఎలా సాగింది? ముకుంద్ తన వృత్తిలో ఎలాంటి సవాళ్లు ఫేస్ చేశాడు? మేజర్‌గా పదోన్నతి పొంది రాజ్‌పుత్ రెజిమెంట్ నుంచి.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై వచ్చాక ఆయన ఎలాంటి ఆపరేషన్లని నిర్వహించాడు అనేది సినిమాలో చూడాల్సిందే.






