
అమరావతి(Amaravathi) ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ(Amaravati Reconstruction) పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. “అమరావతి స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త AP రూపుదాల్చుతోంది. దుర్గాభవానీ(Dugra Bhavani) కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను” అని వ్యాఖ్యానించారు.
Modi speaking flawlessly in Telugu
అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి – ప్రధాని మోడీ 🔥🔥🔥#AmaravatiTheRise pic.twitter.com/Xaef52fT2W
— Vineeth K (@DealsDhamaka) May 2, 2025
మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం
అనంతరం 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి PM పునఃప్రారంభోత్సవం చేశారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో, సభా వేదిక పైనుంచే రాజధాని పునర్ నిర్మాణ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. బటన్ నొక్కి రాజధాని పనులు సహా మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ రూ.49,040 కోట్లు. రూ.8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా PM నేడు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు.
చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.” ప్రధాని మోదీ అన్నారు.
అంతకుముందు అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రసంగించారు. PM మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం నాడు 29 వేల మంది రైతులు తమ భవిష్యత్తును త్యాగం చేసి 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. అమరావతి ఉద్యమం లాంటి దాన్ని తన జీవితంలో చూడలేదని కొనియాడారు.
CM Chandrababu Naidu
I am very happy to inform you, technology means only Narendra Modi
No other politician can understand technology
Only Modi Ji understands technology pic.twitter.com/20AjPMqKcb
— 2 Foreigners In Bollywood (@2_F_I_B) May 2, 2025