Amazon: అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్స్’ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

వినియోగదారులు, కొనుగోలుదారులకు అమెజాన్(Amazon) మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఏటా నిర్వహించే ప్రైమ్ డే సేల్స్‌(Prime Day Sales)ను ఈ ఏడాది కూడా నిర్వహించనుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు 9వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్(Prime Day Sales Event) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని, 124 దేశాలలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. సోనీ, డైసన్, కీహ్ల్స్, లెవీస్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది.

Amazon Prime Day 2025: Exclusive Sale Is Back Again In India From July 12-14

30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్లు

అలాగే ఎలక్ట్రానిక్స్(Electronics), కిచెన్, బ్యూటీ, అపారెల్, బ్యాక్-టు-స్కూల్ సప్లైస్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, బెస్ట్ సెల్లింగ్ టాయ్స్ వంటి 35 కంటే ఎక్కువ విభాగాలలో మిలియన్ల డీల్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ‘టు డేస్ బిగ్ డీల్స్’ పేరుతో ప్రతి రోజు అర్ధరాత్రి పీడీటీ నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయని, పాఠశాల సామగ్రిపై 40 శాతం వరకు, అమెజాన్ బ్రాండ్లపై 30 శాతం వరకు డిస్కౌంట్లు(Discounts) ఉంటాయని తెలిపింది.

10 లక్షలకు పైగా ఉత్పత్తులపై అదే రోజు ఫ్రీ డెలివరీ

కాగా ఇండియాలో ప్రైమ్ సభ్యులు సేల్‌(Sale)లో పది లక్షలకు పైగా ఉత్పత్తులపై అదే రోజు ఉచిత డెలివరీ(Free Delivery)ని పొందవచ్చునని, 40 లక్షలకు పైగా ఉత్పత్తులపై తదుపరి రోజు డెలివరీ సౌకర్యం కలదని, 20 వేలకు పైగా ఉత్పత్తులను 4 గంటల్లో డెలివరీ చేయగలమని అమెజాన్ వెల్లడించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఏం అవసరమో వాటిని ఈ ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్‌లో ఆఫర్ ప్రైజ్‌కే కొనేయండి..

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *