టీమ్ఇండియా(Team India)కు సారథ్యం(Captancy) వహించిన వారిలో ది బెస్ట్ ఎవరో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) తెలిపాడు. ఈ మేరకు భారత మాజీ స్కిపర్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చాడు. దీంతో ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు. ధోనీ ది బెస్ట్ కెప్టెన్ అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాయుడు భారత క్రికెట్ కెప్టెన్ల బ్లైండ్ ర్యాంకింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్లకు ర్యాంకింగ్స్ ఇచ్చిన రాయుడు.. మహీ కెప్టెన్సీలో భారత జట్టు T20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(2013) గెలిచిందని గుర్తు చేశాడు. అలాగే, IPLలో చెన్నయ్ సూపర్ కింగ్స్(CSK)ను ఐదుసార్లు విజేతగా నిలబెట్టాడు.

రెండో స్థానం ఎవరికంటే…
ఇక 17 ఏళ్ల తర్వాత టీమ్ఇండియాకు పొట్టి ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు రాయుడు రెండో స్థానం ఇచ్చాడు. రోహిత్ నేతృత్వంలోనే భారత్ ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్(MI)ను విజయవంతమైన జట్టుగా నిలబెట్టాడు. అతని నాయకత్వంలో ముంబై ఐదుసార్లు టైటిల్ ఎగరేసుకపోయింది. రాయుడు జాబితాలో సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)కి మూడో స్థానం, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev)కి 4వ స్థానం కేటాయించాడు. ఇక, టీమ్ఇండియా అగ్రెసీవ్ ప్లేయర్, కింగ్ కోహ్లీ(Virat Kohli)కి రాయుడు 5వ స్థానం ఇచ్చాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin)కు 6వ స్థానం ఇచ్చాడు.
‘Dhoni No 1 India captain; Kohli fifth’
Read More: https://t.co/RbeDT5N5HU
For regular updates, join: https://t.co/t8pcSJr9NH#Dhoni #MSD #Kohli #AmbatiRayudu #Ranking #SouravGanguly #KapilDev #RohitSharma #Cricket #RediffCricket
— Rediff Cricket (@rediffcricket) July 31, 2025






