Ramayana: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. బాలీవుడ్ ‘రామాయణం’లో బిగ్ బీ?

బాలీవుడ్‌లో రామాయణం(Ramayana) ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, వాల్మీకి రామాయణాన్ని ఆధునిక సాంకేతికతతో గ్రాండ్‌గా ఆవిష్కరించనుంది. అమితాబ్ బచ్చన్ దశరథుడి(Dasharatha) పాత్రలో నటిస్తారని సమాచారం. ఈ పాత్ర రామాయణంలో కీలకం కాబట్టి అమితాబ్‌ వంటి అనుభవజ్ఞుడైన నటుడు ఈ పాత్రకు న్యాయం చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Finally, Official Word on Bollywood's Epic Ramayana - NTV ENGLISH

రెండు భాగాలుగా రామాయణం

అమితాబ్ బచ్చన్‌తో పాటు, ఈ చిత్రంలో ఇతర ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి భాగం 2026లో విడుదల కానుంది. 2027 దీపావళికి రెండో పార్ట్ రానుంది. హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్‌లు, గొప్ప నిర్మాణ విలువలతో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. అమితాబ్ బచ్చన్ ఇటీవల శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రామాయణ కథకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *