Amitabh Bachchan: ‘మీ పనితీరుకు పెద్ద అభిమానిని’.. అల్లు అర్జున్​కు అమితాబ్​ అభినందనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్​ కాంబినేషన్​లో వచ్చిన పుష్ప 2 కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 (Pushpa 2) ఫీవర్​ కనిపిస్తోంది. టాలీవుడ్​లోనే కాదు బాలీవుడ్​లోనూ అదరగొడుతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్లు వసూలు చేసిందని మూవీ బృందం ప్రకటించింది. మూవీ హిట్​ అవడం, ఇదివరకు తన గురించి బన్నీ మాట్లాడడంపై బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబ్​ బచ్చన్​ (Amitabh Bachchan)తాజాగా స్పందించారు. అల్లు అర్జున్​ వర్క్​ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్​ పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయిలో ఓ ఇంటర్వ్యూలో ఐకాన్​ స్టార్​ మాట్లాడుతూ.. ‘అమితాబ్​ బచ్చన్​ అంటే నాకు ఎంతో ఇష్టం. అమితాబ్​ సినిమాలు చూస్తూ పెరిగా. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్​గా ఉన్నారు. ఎంతో మంది నటీనటులకు ఆయన స్ఫూర్తి. అమితాబ్​ స్ఫూర్తితోనే నేనూ ముందుకు వెళుతున్నా’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా అమితాబ్​ బచ్చన్​ X వేదికగా తాజాగా స్పందించారు. ‘థాక్యూ అల్లు అర్జున్​. మీరు నా అర్హతకు మించి మాట్లాడారు. నిజం చెప్పాలంటే నేను మీ ప్రతిభకు, పనితీరుకు పెద్ద అభిమానిని. మీరు ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి. ఇలాంటి హిట్స్​ మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నా. కంగ్రాట్స్​’ అని తెలిపారు. ఈ పోస్టుకు బన్నీ (Icon Star) స్పందించారు. ‘మీరు మా సూపర్​ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. మాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *