ఒకప్పుడు యాంకరింగ్ ద్వారా తనదైన గుర్తింపు సంపాదించుకున్నఅనసూయ(Anasuya Bharadwaj).. ఇప్పుడు వెండితెరపై తన టాలెంట్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న అనసూయ, టీవీ యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి, సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
రంగస్థలం, పుష్ప, క్షణం వంటి హిట్ సినిమాల్లో నటించిన ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆన్‌లైన్ మోసం విషయం బయటపెట్టారు.
అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా @truffle-india అనే ఆన్‌లైన్ క్లాతింగ్ స్టోర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ సంస్థ నుంచి పలు దుస్తులు ఆర్డర్ చేశానని, కానీ ఆర్డర్ డెలివరీ కాలేదని, పైగా డబ్బును కూడా రీఫండ్ చేయలేదని అనసూయ పేర్కొన్నారు. అంతేకాదు, తమ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించడం మానేసారని వెల్లడించారు.
“అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ సంస్థపై అందరూ జాగ్రత్తగా ఉండాలి. దుస్తులు అమ్ముతున్నట్టు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. అందుకే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మీతో పంచుకుంటున్నాను” అంటూ అనసూయ గట్టిగానే స్పందించారు.
ఈ సంఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అనసూయకు మద్దతు తెలియజేస్తూ, “ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి”, “జాగ్రత్తగా ఉండాలి”, “ఇంకా నమ్మకంగా ఉన్న సంస్థలు కొన్ని ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.






