టాలీవుడ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఏపీలో టికెట్ ధరల పెంపు
మరో రెండ్రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందానికి ఏపీ సర్కార్ (AP Govt Tickets Price) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఈ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించింది. తొలి వారం రోజులపాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ.197, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.252కు చేరింది.
తెలంగాణలో నో బెనిఫిట్ షోస్
మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్ ధరల్లో ఎలాంటి వెసులుబాటు లేదు. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల (Telangana Benefit Show) విషయంలో రేవంత్ సర్కార్ కఠిన పాలసీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తండేల్ సినిమా సంగతికి వస్తే.. 2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోంది. దీన్ని గీతా ఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.
బుజ్జితల్లి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తున్న మూడో సినిమా. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో సాయి పల్లవి (Sai Pallavi) శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది. తండేల్ గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.






