
ఏపీ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP SSC Results 2025) విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైటులో ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లోనూ ఫలితాలు
మరోవైపు పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ (Mana Mithra Whatsapp), లీప్ యాప్‌లోనూ పదోతరగతి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని సూచించారు. వాట్సాప్ నెంబర్ 95523 00009కు హాయ్ మెసేజ్ పంపినా ఫలితాలు వస్తాయని వెల్లడించారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించినట్లు వివరించారు.