టీమ్ఇండియా(Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మళ్లీ నిరాశ పరిచాడు. ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్(Railways) జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్(Ranji Match)లో ఢిల్లీ జట్టు తరఫున ఆడిన కోహ్లీ కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బందులు పడుతున్న రన్‌మెషీన్ తిరిగి గాడిలో పడేందుకు రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, BCCI కూడా ఇటీవల జాతీయ జట్టులో ఆడే ప్రతి ప్లేయర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంటే రంజీ మ్యాచ్‌లు ఆడాలని సూచించింది.
12 ఏళ్ల తర్వాత వచ్చి 12 రన్స్ కూడా చేయలేదు..
ఈ నేపథ్యంలోనే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున విరాట్ రంజీ బరిలోకి దిగాడు. అయితే, ఇక్కడ కూడా నిరాశ పరిచాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. సాంగ్వాన్(Sangwon) విసిరిన చక్కటి బంతికి క్లీన్‌బౌల్డ్(Clean bowled) అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ స్టంప్ గింగిరాలు తిరుగి ఎగిరిపడంది. దీంతో అతని కోసం మైదానానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు నిరాశచెందారు. నిన్నటి నుంచి అతని బ్యాటింగ్ చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. కోహ్లీ ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 12 ఏళ్ల తర్వాత వచ్చిన కోహ్లీ కనీసం 12 పరుగులు కూడా చేయలేందంటూ కొందరు సోషల్ మీడియా(Social Media)లో విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 రన్స్‌కు ఆలౌట్ అయింది.
What A knock by virat kohli another failure
Virat kohli
Kingkohli pic.twitter.com/pD2UQ2E3Sz— Narendra Kumar (@Narendr35) January 31, 2025






